Bank Loan: రూ.వేల కోట్లు ఎగ్గొట్టినా పట్టించుకోరు, రైతుల వెంట పడతారా?

 Bank Loan: రూ.వేల కోట్లు ఎగ్గొట్టినా పట్టించుకోరు, రైతుల వెంట పడతారా? : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేవారిపై కాకుండా రైతులపై కేసులు పెడుతుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విధంగా రైతులను న్యాయస్థానాలకు లాగితే వారి కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతాయని తెలిపింది. పెద్ద చేపలను వెంటాడాలని హితవు పలికింది. ఓ రైతుకు సంబంధించిన కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

SBI: ఎస్‌బీఐ నుంచి రూ.9,00,000 ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణం పొందిన రైతు మోహన్‌లాల్ పాటిదార్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తానని బ్యాంకుకు చెప్పారు. రూ.36,50,000/- చెల్లించవలసి ఉందని లెక్కగట్టారు. ఆయన ముందుగా రూ.35,00,000/- చెల్లించారు. బ్యాంకు ఆ సొమ్మును స్వీకరించింది. అయితే ఈ బ్యాంకుకు చెందిన అసెట్ రికవరీ బ్రాంచ్ స్పందిస్తూ, పూర్తి, తుది పరిష్కారంగా రూ.50.50 లక్షలు చెల్లించవలసి ఉంటుందని ఆ రైతుకు తెలిపింది. దీంతో ఆ రైతు మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 

మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

ఆ రైతు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, 2021 మార్చి 9నాటి లేఖనుబట్టి తన క్లయింట్ వన్ టైమ్ సెటిల్మెంట్ సొమ్ములో కనీసం 10 శాతం సొమ్మును నిర్ణీత కాలంలో చెల్లించవలసి ఉందని, అయితే తన క్లయింట్ నిర్ణీత గడువులోగా రూ.36,50,000/-లలో రూ.35,00,000/- చెల్లించారని చెప్పారు. 

‘ఇంటిమేషన్ లెటర్’ను జారీ చేసిన తర్వాత అందుకు అనుగుణంగా వ్యవహరించడం తప్ప బ్యాంకుకు మరొక అవకాశం ఏదీ లేదన్నారు. పిటిషనర్ అర్హుడైతే ‘శాంక్షన్ లెటర్’ను జారీ చేయాలన్నారు. దీనిని అంగీకరించడంలో బ్యాంకు విఫలమైందని, రాజీ కుదిరిన మొత్తాన్ని రూ.50.50 లక్షలకు ఏకపక్షంగా పెంచిందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌కు విరుద్ధమని తెలిపారు

 మీ పీఎఫ్ ఖాతా లో ఉన్న బాలన్స్ ఎంతో  తెలుసుకోండి 

హైకోర్టు 2022 ఫిబ్రవరి 21న తీర్పు చెప్తూ, బ్యాంకు ఆదేశాలను రద్దు చేసింది. బ్యాంకు చర్యలు, ఆదేశాలను ఆమోదించలేమని జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ ద్వారకాధీశ్ బన్సల్ తెలిపారు. 2021 సెప్టెంబరు 22న ఆర్డర్ జారీ అయిన తర్వాత రెండు నెలల్లోగా సక్రమంగానే పిటిషన్లను దాఖలు చేశారన్నారు. ఓటీఎస్ స్కీములోని క్లాజ్-7 కారణంగా ఈ ఆఫర్ దానంతట అదే ముగిసిందని చెప్పలేమని పేర్కొన్నారు. పిటిషనర్ ఈ ఆర్డర్‌ను సరైన రీతిలో సవాల్ చేయడం మాత్రమే కాకుండా 2021 ఆగస్టు 25న తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని పిటిషనర్ ఎన్నడూ అంగీకరించలేదని గుర్తు చేసింది. 2021 ఆగస్టు 25న జారీ చేసిన లేఖ చట్టవిరుద్ధమైనదని మేము చెప్పినప్పటికీ, ఓటీఎస్ పాలసీలోని క్లాజ్ -7 ఈ ఓటీఎస్ ప్రయోజనాల ఫలాలను తొలగించజాలదని తెలిపారు. 

Departmental test Latest Notification,Material (GO/EO)

పిటిషన్లు సమర్పించిన ఓటీఎస్ ప్రతిపాదనను బ్యాంకు ఆమోదించి, వెంటనే శాంక్షన్ లెటర్స్‌ను జారీ చేయాలని అన్నారు. మిగతా లాంఛనాలను బ్యాంకు పూర్తి చేయాలని, దాని ఫలితంగా పిటిషనర్లకు లభించే అన్ని అనుబంధ ప్రయోజనాలను వారికి కల్పించాలని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు. 

AMMA  VODI: మీ ఆధార్ కార్డు కి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ లింక్ అయ్యాయో ఇక్కడ తెలుసుకోండి

దీనిపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో అపీలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించింది. పెద్ద చేపలను వెంటాడాలని, ఇలాంటి వ్యాజ్యాల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా నాశనమైపోతాయని చెప్పారు.

 AP ICET 2022 NOTIFICATION RELEASED

‘‘వేల కోట్ల రూపాయల మేరకు దోచుకునేవారిని మీరు వెంటాడరు. కానీ రైతుల విషయం వచ్చేసరికి అన్ని చట్టాలు వచ్చేస్తాయి. మీరు డౌన్ పేమెంట్‌ను కూడా అంగీకరించారు’’ అని సుప్రీంకోర్టు మౌఖికంగా పేర్కొంది. ఈ అపీలును తోసిపుచ్చింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad