Mangoes: మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను తినకండి

 Mangoes: మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.!


Mango Eating Mistakes:వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. పండ్లకు రారాజు.. మామిడి పండు. మామిడి పండు.. భారతదేశపు జాతీయ ఫలం. మన దేశంలో పండే మామిడి పండ్లకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. బంగిన పల్లి, కలెక్టర్, అరటి మామిడి, సువర్ణ రేఖ, నీలాలు, చెరకురసం, చిన్న రసం, పెద్ద రసం ఇలా అనేక మామిడి రకాలున్నాయి. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. 

మామిడిపండులో ఫైబర్‌ మన జీర్ణవ్యవస్థను కాపాడడమే కాక, బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది.  అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త
.

  1. మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం సరికాదని వైద్యులు సూచన. మామిడి, పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. అది మన శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు.
  2. మామిడి తిన్న తర్వాత మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపు, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు.
  3. మామిడి పండ్లు తీసుకున్న వెంటనే కాకరకాయ తినడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.
  4. మామిడి తిన్న వెంటనే శీతల పానీయాలు తాగడం కూడా హానికరమని వైద్యులు చెబుతున్నారు. మిడి పండ్లలో, శీతల పానీయాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం.
  5. మామిడి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ ఏర్పడతాయి. ఇలా చేయడం వల్ల పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మామిడి తిన్న అరగంట తర్వాత నీరు తాగాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

ALSO READ: 

పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

ఎండకాలంలో రాగి జవ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం

ఇంటర్ అయ్యాక ఏ ఏ కోర్స్ లు చదవచ్చు.. వివరాలకు

టెన్త్ అయ్యాక విద్యార్థులు ఏ ఏ కోర్స్ లు చదవాలి .. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి  ?

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad