SBI OFFER: కొత్త కార్ కొనాలనుకునేవారికి SBI ఆఫర్స్... రూ.25,000 వరకు బెనిఫిట్స్

 SBI OFFER: కొత్త కార్ కొనాలనుకునేవారికి ఎస్‌బీఐ ఆఫర్స్... రూ.25,000 వరకు బెనిఫిట్స్..


కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? మీరు ఏ మోడల్ కార్ కొనాలనుకున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఆఫర్స్ పొందొచ్చు. యోనో ఎస్‌బీఐ ద్వారా కార్ లోన్ (Car Loan) కోసం దరఖాస్తు చేసుకున్నా, కొత్త కార్ బుక్ చేసుకున్నా ఆఫర్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్ల నుంచి ఈ ఆఫర్స్ పొందొచ్చు. టాటా మోటార్స్, హుందాయ్, టోయోటా, ఆడి, కియా మోటార్స్, మారుతీ సుజుకీ, రెనాల్ట్ లాంటి బ్రాండ్స్ కార్లపై ఆఫర్స్ ప్రకటించింది ఎస్‌బీఐ. కస్టమర్లు చేయాల్సిందల్లా యోనో ఎస్‌బీఐ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కార్ బుక్ చేయడమే. వారు ఈ ఆఫర్స్ పొందొచ్చు. మరి ఏ బ్రాండ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

READ: SBI బంపరాఫర్.. LIC IPO లో షేర్స్ కొనడానికి రుణాలు

Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ కార్ కొంటే రూ.25,000 విలువైన క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది.

Audi: ఆడీ కార్ బుక్ చేస్తే రూ.25,000 విలువైన అదనపు క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది.

Tata Motors: టాటా మోటార్స్ కార్ కొంటే రూ.5,000 వరకు అదనంగా క్యాష్ డిస్కౌంట్స్ పొందొచ్చు.

READ:SBI బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ.8,00,000 లోన్...  మరోసారి ఆఫర్  

Toyota: టొయోటా కార్ కొంటే రూ.5,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు.

Datsun: డాట్సన్ కార్ కొంటే రూ.4,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

Renault: రెనాల్ట్ కార్ కొంటే రూ.5,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు.

Hyundai: హుందాయ్ కార్ బుక్ చేసుకుంటే సెలెక్టెడ్ మోడల్స్‌పై ప్రియార్టీ డెలివరీ లభిస్తుంది.

Mahindra: మహీంద్రా ఎస్‌యూవీ కార్ బుక్ చేస్తే రూ.3,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు.

Maruti Suzuki: మారుతీ సుజుకీ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad