UPSC NDA 1 results 2022: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ రాత పరీక్ష ఫలితాలు విడుదల
PSC National Defence Academy Results 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA 1 2022) నేషనల్ డిఫెన్స్ అకాడమీ రాత పరీక్ష ఫలితాలు సోమవారం (9 మే) విడుదలయ్యాయి. ఏప్రిల్ 10న దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అభ్యర్ధుల రోల్ నెంబర్ల ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేసింది. వీరంతా నియామక ప్రక్రియలో తర్వాత దశ అయిన ఇంటర్వ్యూకు హాజరవ్వడానికి అర్హత సాధించినట్లు కమిషన్ ఈ సందర్భంగా తెల్పింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ NDA 1 ఫలితాలు 2022 ప్రకటించిన రెండు వారాలలోపు ఇంటర్వ్యూ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ వెబ్‌సైట్ అంటే joinindianarmy.nic.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డులకు సమర్పించవల్సి ఉంటుంది. వయసు ధృవీకరణ సర్టిఫికేట్ (ఏజ్ ప్రూఫ్), విద్యా అర్హత సర్టిఫికెట్లను సమర్పించాలి.U
UPSC NDA 2022 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను
https://www.upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
హోమ్‌పేజ్‌లో కనిపించే రాత EXAM RESULTS పై క్లిక్ చెయ్యాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
National Defense Academy I 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
NDA 1 PDF స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
మీ పేరును చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌ను ఎంటర్ చెయ్యాలి.
తర్వాత ఎన్డీఏ 1 ఫలితాలకు 2022 సంబంధించిన pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Exam Name |
Download |
Date of Upload |
National Defence
Academy and Naval Academy Examination (I), 2022 |
|
09/05/2022 |
Indian Forest
Service (Main) Examination, 2021 |
|
13/04/2022 |