Weather Update: Hot సమ్మర్‌లో Cool న్యూస్....

 Weather Update: హాట్ సమ్మర్‌లో కూల్ న్యూస్.... 

pre-monsoon

Telugu States: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తం భానుడి భగభగలతో అల్లాడిపోతోంది. ఒకవైపు మండుటెండలు, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు కరెంట్‌ కోతలతో విలవిల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలైతే దాదాపు హాఫ్‌ సెంచరీ టెంపరేచర్స్‌తో మలమలమాడిపోతున్నారు. ఇలాంటి టైమ్‌లో దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణశాఖ. మాన్‌సూన్‌పై తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఎర్లీ మాన్‌సూన్‌ ఉంటుందని ప్రకటించింది. గడువు కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది ఐఎండీ(IMD). సాధారణంగా ఏటా జూన్‌ ఒకటి తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలో ఎంట్రీ ఇస్తుంటాయ్‌. కానీ, ఈసారి 15రోజుల కంటే ముందుగానే మాన్‌సూన్‌ రాబోతోంది. మే 15కల్లా, అంటే ఒకట్రెండు రోజుల్లోనే అండమాన్‌ అండ్ నికోబార్‌ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, చిరు జల్లులు కురుస్తాయని తెలిపింది. 

తరువాతి ఐదు రోజుల్లో నే కేరళలోకి రుతు పవనాలు విస్తరిస్తాయని ఐఎండీ ప్రకటించింది. జూన్‌ ఫస్ట్‌ వీక్‌కల్లా తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ ఐదు నుంచి 8 తేదీల మధ్య ఏపీ, తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది భారత వాతావరణశాఖ. కేరళలోకి మాన్‌సూన్‌ ఎంటరైందంటే, ఐదారు రోజుల్లోపే రాయలసీమలోకి ఎంటరైపోతాయి నైరుతి రుతుపవనాలు. ఆ తర్వాత, టు వీక్స్‌ గ్యాప్‌లో దేశమంతటా విస్తరిస్తాయ్‌ నైరుతి వర్ష మేఘాలు. ఇక, ఈ ఏడాది సాధారణ కంటే అధిక వర్షపాతం ఉంటుందన్న ఐఎండీ, జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి మాన్‌సూన్‌ సీజన్‌ కొనసాగుతుందని తెలిపింది. ఐఎండీ చెప్పిన చల్లని కబురుతో ప్రజలతోపాటు దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వర్షాధారిత పంటలు వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad