ఏపీ విద్యార్థులకు అలర్ట్.. స్కూళ్ల ప్రారంభం తేదీ వాయిదా.. కొత్త తేదీ ఇదే..
ఏపీలో స్కూళ్లను ప్రారంభించే తేదీని అధికారులు వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన కొత్త తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లు ప్రారంభించే తేదీని వాయిదా వేసింది విద్యాశాఖ. రాష్ట్రంలో మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు జులై 4న తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అయితే.. స్కూళ్లను జులై 4కు బదులుగా.. 5న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామారాజుకు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
సాధారణంగా జూన్ లో పాఠశాలలను ప్రారంభిస్తారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా స్కూళ్ల ప్రారంభాన్ని ఈ సారి ఆలస్యంగా జులైలో ప్రారంభించాలని నిర్ణయించింది జగన్ సర్కార్. This is not official news: source : tv18 news