SSC recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ లోపు 42వేల పోస్టులు భర్తీ
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 42,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు SSC ప్రకటించింది. మరో నెలరోజుల్లో 15,247 పోస్టులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు కూడా కమిషన్ వెల్లడించింది. ఇదే విషయాన్ని Press Information Buero (PIB) ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆదివారం ప్రకటించింది. సైన్యంలో నియామకాల కోసం చేపట్టిన 'అగ్నిపథ్' ప్రాజెక్టుపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే 2022 చివరి నాటికి భారీగా పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వార్త రావడం గమనార్హం. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కొత్తగా ఈ ప్రకటన వెలువడింది.
దీనికి సంబంధించిన PIB పోస్ట్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. 2022 December లోపు 42,000 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతోపాటు 67,768 ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాలని SSC ప్లాన్ చేస్తోంది.’ అని పేర్కొంది. మరికొన్ని నెలల్లో 15,247 పోస్టులకు నియామక పత్రాలు జారీ చేసే విషయంపై కమిషన్ స్పందిస్తూ.. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు వీటిని జారీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇంకా పెద్దగా సమాచారం వెలువడనప్పటికీ, ఈ వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు భారీ ఊరటనిస్తుంది
ఈ ఏడాది డిసెంబర్ లోపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 42,000 ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్ ధ్రువీకరిస్తోంది. రాబోయే రోజుల్లో పరీక్షలు నిర్వహించి 67,768 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కమిషన్ యోచిస్తోంది. 15,247 పోస్టులకు నియామక పత్రాల జారీ ప్రక్రియను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో పూర్తి చేయనుంది. ఈ లేఖలను మరో రెండు నెలల్లో వివిధ శాఖలు జారీ చేయనున్నాయి. ఈ గోల్డెన్ ఛాన్స్ కోసం ఉద్యోగార్థులు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Recent Job Notifications
NPCIL Recruitment 2022: 177 Apprentice Posts
IBPS CRP RRB XI Recruitment 2022 – 8106 Posts
SBI భారీ జాబ్ నోటిఫికేషన్.. 642 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు