POST OFFICE MONTHLY INCOME POLICY : నెల‌వారీ ఆదాయానిచ్చే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్

 నెల‌వారీ ఆదాయానిచ్చే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ (PO MIS)

Earn 6.6% interest on Post Office Monthly Income Scheme; Check eligibility, taxation, other details here. If you are looking for regular monthly income, the Post Office Monthly Income Scheme (POMIS) suit you as it is risk-free with guaranteed returns. The post office offers a monthly income scheme where investors can earn up to 6.6% annual interest every month.
పొదుపు చేసేవారు, రిస్క్‌కు ఇష్ట‌ప‌డ‌నివారు సాంప్ర‌దాయ పెట్టుబ‌డుదార్లు ముందుగా చూసేది పోస్ట‌ల్ డిపాజిట్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లే. వీటికి ఆదాయ ప‌న్ను ఉన్నా కూడా ప్ర‌భుత్వ గ్యారెంటీ హామి ఉండ‌టం చేత పొదుపుదారుల‌కు వీటి మీద అపారమైన‌ న‌మ్మ‌కం. వ‌డ్డీ రేట్లు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతున్నా కూడా ఇవి అనేక ద‌శాబ్దాల నుండి పొదుపు చేసే మ‌దుపుదార్ల‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సాంప్ర‌దాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టేవారి సంఖ్య పెరిగిందే కాని త‌గ్గ‌లేదు. అలాంటి పొదుపు ప‌థ‌కాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ఒక‌టి. 

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌ (PO-MIS)తో హామితో కూడిన నెల‌వారీ ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబ‌డిదారుల‌చే డిపాజిట్ చేయ‌బ‌డిన డ‌బ్బు మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి ఉండ‌దు. రిస్క్ ఉండ‌క‌పోవ‌డంచేత సాంప్ర‌దాయ‌క పెట్టుబ‌డిదారుల‌లో ఈ ప‌థ‌కం మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఇది ప్ర‌భుత్వ హామి ఉన్న ప‌థ‌కం కాబ‌ట్టి, మెచ్యూరిటీ వ‌ర‌కు పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వంచే ర‌క్ష‌ణ ఉంటుంది. ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధితో వ‌స్తుంది. పొదుపుదార్లు అధిక వ‌డ్డీ రేట్ల‌ను అందించే పెట్టుబ‌డి సాధ‌నాల వైపే కాకుండా సుర‌క్షిత‌మైన పొదుపు సాధ‌నాల్లోనే ఎక్కువ పెట్టుబ‌డులు పెడుతుంటారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ (PO-MIS) అనేది చిన్న పొదుపు పెట్టుబ‌డి ప‌థ‌కాల‌లో ఒక‌టి. ముఖ్యంగా సాంప్ర‌దాయ‌వాద పెట్టుబ‌డిదారులు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌థ‌కం స‌రిపోతుంది.

ఈ ప‌థ‌కం భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధ పెట్టుబ‌డి ఎంపిక‌ల‌లో ఒక‌టి, ఎందుకంటే దీనిని నామ‌మాత్ర‌పు మొత్తంతో ప్రారంభించ‌వ‌చ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో క‌నీసం రూ. 1,000 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక ఖాతాలో గ‌రిష్టంగా రూ. 4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో రూ. 9 ల‌క్ష‌లు గ‌రిష్టంగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. సంవ‌త్స‌రానికి ల‌భించే వ‌డ్డీ రేటు 6.6%, ప్ర‌తి నెలా వ‌డ్డీ అంద‌చేయ‌బ‌డుతుంది. ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ్య‌ధితో వ‌స్తుంది. పెట్టుబ‌డి మెచ్యూర్ అయిన త‌ర్వాత నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు, తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే ఇది ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. డిపాజిట్ల‌పై ఆదాయ ప‌న్ను మిన‌హాయింపుల్లేవు. ఈ పోస్టాఫీసు ప‌థ‌కంలో పెట్టుబ‌డులు సెక్ష‌న్ 80సీ కింద‌కు రావు.

ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టిన మొద‌టి నెల నుండి, మీరు ఈ ప‌థ‌కం నుండి చెల్లింపును అందుకుంటారు. అయితే, చెల్లింపు ప్ర‌తి నెలాఖ‌రులో వ‌స్తుంది. అయితే ఇందులో రాబ‌డులు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించ‌వ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పెట్టుబ‌డిదారుగా ఉన్న‌ప్ప‌టికీ, మీరు బ‌హుళ ఖాతా యాజ‌మాన్యాన్ని క‌లిగి ఉండ‌వ‌చ్చు, అయితే డిపాజిట్ మొత్తం రూ. 4.5 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. మీరు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌తో గ‌రిష్టంగా ముగ్గురు వ్య‌క్తుల‌తో ఉమ్మ‌డి ఖాతాను కూడా తెర‌వ‌వ‌చ్చు. అయితే, ఖాతా ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా ఖాతాదారులంద‌రికీ స‌మానంగా ఖాతా చెందుతుంది. 10 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సున్న మైన‌ర్ త‌ర‌పున ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. మైన‌ర్ 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చిన త‌ర్వాత ఖాతాను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఉంటుంది.

CHECK HERE FOR MORE DETAILS

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad