SBI భారీ జాబ్ నోటిఫికేషన్.. 642 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. నెలకు రూ.41,000 వరకూ జీతం.. పూర్తి వివరాలివే
ఎస్‌బీఐ జాబ్ రిక్రూట్‌మెంట్ 2022
642 పోస్టుల భర్తీకి ప్రకటన
జూన్ 7 దరఖాస్తులకు చివరితేది
SBI Recruitment 2022: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 642 పోస్టులను భర్తీ చేయనుంది. రిటైర్డ్ అధికారులను ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టుల్లో రిక్రూట్‌మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
EPF: కోట్లాది మంది PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయ్...వివరాలు ఇవిగో
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Total Vacancy: 642
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ (CMF-AC): 503
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్(CMS-AC): 130
సపోర్ట్ ఆఫీసర్ (SO-AC): 08
Pay Scales:
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ పోస్టులకు నెలకు రూ. 36,000
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ (CMS) పోస్టులకు నెలకు రూ. 41,000
సపోర్ట్ ఆఫీసర్-ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులకు నెలకు రూ. 41,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
AGE LIMIT: అభ్యర్ధుల వయసు 63 ఏళ్లకు మించరాదు.
ELIGIBILIY: IT/Computer Science లో BE/B.Tech. లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏటీఎమ్ పనిలో అనుభవం ఉన్న రిటైర్డ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Selection Process: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
Application Process: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Last Date to Apply: జూన్ 7, 2022
ALSO READ:
1.Postal Jobs: 38926 JOBS in the Postal Department
2. SSC JOB NOTIFICATION 2022: NOTIFICAITON FOR 2065 POSTS Through SSC
3. SBI: ENGAGEMENT OF RETIRED BANK STAFF ON CONTRACT BASISRailway Jobs:
4.రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 1044 ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ చాలు