WhatsApp: పెద్ద మార్పే ఇది.. వాట్సాప్ నుంచి పెద్ద గుడ్‌న్యూస్..
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడే యూజర్లు.. ఒకవేళ ఐఫోన్‌కు మారితే.. ఆండ్రాయిడ్‌లో ఉన్నా వాట్సాప్ డేటాను ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం లేదు. దాంతో యూజర్లు తమ డేటాను కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటి యూజర్లను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారే యూజర్లు.. తమ వాట్సాప్ డేటాను ఏ మాత్రం కోల్పోకుండా ఉండేలా ఆపిల్ మూవ్ టు ఐవోఎస్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో కొత్తగా ఐఫోన్ కొన్న యూజర్లు.. తమ పాత ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సులభంగా డేటాను ఐఫోన్‌లోకి మార్చుకోవచ్చు.
READ: నెంబర్ సేవ్ చెయ్యకుండా వాట్సాప్ మెసేజ్ ఇలా చెయ్యండి
ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు.. తమ వాట్సాప్ డేటాను బ్యాకప్ పెట్టుకోవాలి.. తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్‌లో ‘Move to ios యాప్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి..
అప్పుడు ఓ కోడ్ కనిపిస్తుంది. ఆ కోడ్‌ను ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఎంటర్ చేయాలి. అప్పుడు ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడే వాట్సాప్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి..
ఇప్పుడు డేటా ఎక్స్‌పోర్ట్ అయ్యే వరకు ఆగాలి.. తర్వాత డేటా అంతా ప్రిపేర్ అయ్యాక సైన్‌ఔట్ అవుతుంది. తర్వాత కంటిన్యూపై ట్యాప్ చేస్తే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అప్పుడు ఐఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ వాట్సాప్‌కి గతంలో ఏ నంబర్ అయితే ఉపయోగించారో ఆ నంబర్‌తోనే లాగిన్ అవ్వాలి.. అప్పుడు మీ ఐఫోన్‌లోకి ఆండ్రాయిడ్ డేటా అంతా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావాలంటే IOS 15.5 ఆ తర్వాతి వెర్షన్ ఓఎస్ వాడుతుండాలి.. అప్పుడే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ALSO READ:
1.గూగుల్‌లో 241543903 తో ఎప్పుడైనా సెర్చ్ చేశారా.?
2.JIO వినియోగదారులకి సూపర్ ప్లాన్.. రు . 151 కె మూడు నెలల డేటా .. పూర్తి వివరాలు
3.మీ వాహనం మీద ఉన్న ట్రాఫిక్ చలానా వివరాలు ఇలా తెలుసుకోండి ...