'పిస్తా'తో బోలెడు ప్రయోజనాలు
రోజూ ఖాళీగా ఉన్న సమయాల్లో చిరు తిండి తింటూ చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చిరుతిళ్ల స్థానంలో నట్స్ తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వేళ నిత్యం కొన్ని 'పిస్తా' గింజలను తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని, నిత్యం వాటిని తినాలని సూచిస్తున్నారు. ఇందులో కేలరీలు, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ బీ6, థయమిన్, రాగి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గుండె సంబంధ వ్యాధులు దూరం అవుతాయి. అంతే కాకుండా పిస్తాలలో ఉండే ఫైబర్, మినరల్స్ కారణంగా బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
Benefits of pistachio
ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండడంతో కడుపు నిండిన భావనను కల్పిస్తాయి. బరువు తగ్గేందుకు సాయపడతాయి. పిస్తాలలో లభించే పోషకాలతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన గుండె పనితీరును ప్రోత్సహిస్తాయి. నాడీ వ్యవస్థను సురక్షితంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ను మెరుగుపరుస్తాయి. దృష్టి(చూపు) సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణక్రియ సమస్యలను తలెత్తకుండా చేస్తాయి. శరీరంలో వాపును నివారిస్తాయి. ఆరోగ్యకరమై జుట్టును అందిస్తుంది