నిమ్మరసం వల్ల ఆ సమస్యలన్నీ దూరం...!
నిమ్మరసాన్ని రోజూ గ్లాస్ వేడి నీటిలో కలుపుకుని తాగితే సహజసిద్ధమైన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని, ఓ నిమ్మకాయను అందులో పూర్తిగా పిండి, ఆ నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చాలా రోగాలు మాయమవుతాయి. బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వేడి నీటితో నిమ్మరసాన్ని తాగితే పొందే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును కరిగించేస్తుంది
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చాలా రకాల ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి.
కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి.
రోజూ నిమ్మరసాన్ని తాగితే జీర్ణాశయ సమస్యలు రావు.
చర్మం మృదువుగా, కోమలంగా తయారవుతుంది.
ముడతలు, మచ్చలు పోతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, రోజూ ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి, తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు.