Kidney Health: మీరు వీటిని ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త!

 Kidney Health: మీరు వీటిని ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త.. ఆరోగ్యంపై మరింత దాడి జరగవచ్చు


Kidney Health: ప్రొటీన్ కు కేరాఫ్ అడ్రస్ పప్పు ధాన్యాలు. నాన్ వెజ్ తినని వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయ ఆహారం. మన దేశంలో వీటి వినియోగం ఎక్కువ. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను నియంత్రిస్తుంది మరియు శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పప్పులు తింటే మధుమేహం ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న పప్పులను అధికంగా వాడితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.

పప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై నేరుగా ప్రభావం పడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. పప్పుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్న పదార్థాలు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది.

మీ Treasury ID తో మీ జీతం వివరాలు ఒక్క క్లిక్క్ తో తెలుసుకోండి

పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అదనపు ప్రోటీన్ శ

రీరంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు పప్పు తినడం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. లెగ్యూమ్‌లలో లెక్టిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. వాటిలోని ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కానీ విసర్జన సరిగ్గా జరగనప్పుడు యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వేళ్లు వాపు, కిడ్నీ సమస్యలు వస్తాయి.

AVANIGADDA PRAGATHI TOTAL MATERIAL FOR DSC AND TET

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad