NPS అకౌంట్ నుంచి ఒకేసారి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు..? నిబంధనలు ఏవి..?

 NPS అకౌంట్ నుంచి ఒకేసారి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు..? దీనికి సంబంధించిన నిబంధనలు ఏవి..?


ఎక్కువగా శాలరీలు అందుకుంటున్న ఉద్యోగులు ఎంప్లాయూస్‌ ప్రావిడెంట్ ఫండ్(EPF)కు తమ నిధులను కాంట్రిబ్యూట్‌ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా చెల్లించాల్సిన బేసిక్‌ శాలరీలో 12 శాతం కంటే ఎక్కువగా ఎంప్లాయూస్‌ ప్రావిడెంట్ ఫండ్‌కు స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్‌ చేస్తున్నారు.

READ: CAT 2022 NOTIFICATION RELEASED

ఈపీఎఫ్‌ ద్వారా పన్ను రహిత అధిక వడ్డీ అందుతుంది. అయితే ఈపీఎఫ్‌కి సంబంధించి జరిగిన రెండు పరిణామాలు కొంతమంది హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యుయల్స్‌(HNI) తమ విధానాన్ని పునరాలోచించుకునేలా చేశాయి. ఇప్పుడు ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌లపై సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ వచ్చే వడ్డీపై పన్ను విధిస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ రేటు 40 ఏళ్ల కనిష్టమైన 8.1 శాతానికి చేరుకుంది. దీంతో చాలా మంది ఈపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడంపై పునరాలోచిస్తున్నారు.

* EPF, NPSలో ఏది బెస్ట్‌

EPF (లేదా VPF)లో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్‌ చేసేవారు.. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ, పన్ను ప్రయోజనాలు, రిటర్న్‌ల పరంగా NPS ఇప్పుడు ఆకర్షణీయమైన ప్రొడక్ట్‌గా కనిపిస్తోంది. వీలైతే NPSలలో పెట్టుబడులు పెట్టాలని క్లయింట్‌లకు సలహా ఇస్తున్నామని టాక్స్‌స్పానర్.కామ్, టాక్స్ కన్సల్టెన్సీ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుధీర్ కౌశిక్ చెప్పారు. అయితే VPF, NPSలను పోల్చలేమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. VPF, NPS రెండింటికీ పోర్టిఫోలియోలో చోటు కల్పించవచ్చని చెబుతున్నారు. ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌లపై రూ.2.5 లక్షలకు మించి వడ్డీ అందితే పన్ను చెల్లించాల్సినప్పటికీ.. అది ఆకర్షణీయంగానే ఉందని, ఇందులో అదనపు మొత్తంపై మాత్రమే పన్ను ఉంటుందని తెలిపారు.

రిస్క్‌లేని పెట్టుబడులను కోరుకునే వారిని EPF ఆకర్షిస్తుంది. NPS అనేది మార్కెట్-రిలేటెడ్‌ ప్రొడక్ట్‌, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి రాబడి ఉంటుంది. మార్కెట్‌లోని వైరుధ్యాలు ఏమైనప్పటికీ EPFకి ప్రభుత్వం ప్రకటించిన రేటుకు వడ్డీని చెల్లించాలి. ఈ సంవత్సరం VPF ఇన్వెస్ట్‌మెంట్లలో కొంత భాగాన్ని NPSకి తరలించాలని అనుకుంటే.. ముఖ్యంగా NPS రిటైర్మెంట్ కార్పస్ నుంచి విత్‌డ్రా లిమిట్స్‌ గురించి తెలుసుకోవాలి.

మీ Treasury ID తో మీ జీతం వివరాలు  ఒక్క క్లిక్క్ తో తెలుసుకోండి

* రిటైర్‌మెంట్‌కు ముందు NPS నుంచి పార్షియల్‌ విత్‌డ్రాయల్స్‌ చేయవచ్చా?

NPS కింద టైర్-I, టైర్-II అనే రెండు ఖాతాలను ఓపెన్‌ చేయవచ్చు. తరువాత సేవింగ్స్ అకౌంట్‌ స్వచ్ఛందంగా ఓపెన్‌ అవుతుంది. విత్‌డ్రాలపై ఎటువంటి లిమిట్స్‌ లేవు. టైర్-Iకి సంబంధించి రిటైర్‌మెంట్‌కు ముందు కొన్ని నిబంధనలకు లోబడి పార్షియల్‌ విత్‌డ్రాయల్స్‌ చేయవచ్చు. ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఓన్‌ కాంట్రిబ్యూషన్స్‌లో 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది అనారోగ్యం, వైకల్యం, పిల్లల విద్య లేదా వివాహానికి, ఆస్తి కొనుగోలుకు ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కొత్త వెంచర్‌ను ప్రారంభించాలనుకుంటే కూడా ఈ విత్‌డ్రాకు వీలుంటుంది. మొత్తం వ్యవధిలో గరిష్టంగా మూడు సార్లు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

* NPS నుంచి పూర్తిగా ఎగ్జిట్‌ అవ్వాలంటే ఏం చేయాలి?

షరతులకు లోబడి ఎగ్జిట్‌ అవ్వవచ్చు. పదేళ్లు పూర్తి కాకముందే అలాంటి విత్‌డ్రా చేయలేరు. 60 ఏళ్లు నిండిన తర్వాత NPSలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. ఈ వ్యవధి చాలా తక్కువగా కేవలం 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రీ మెచ్యూర్‌ సందర్భాలలో అకౌంట్‌ కార్పస్‌లో 20 శాతం వరకు ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంప్యానెల్డ్ ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కార్పస్‌లో 80 శాతం తప్పనిసరిగా ఉపయోగించాలి. రిటైర్‌మెంట్‌ తర్వాత, 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ చెల్లించడానికి ఈ యాన్యుటీ ప్లాన్ ఉపయోగపడుతుంది. అయితే అకౌంట్‌ మొత్తం కార్పస్ రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే.. NPS మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తుంది.

READ: పదవ తరగతి తో పోస్టాఫీస్ ఉద్యోగాలు

* రిటైర్‌మెంట్‌ సమయంలో మొత్తం కార్పస్‌ విత్‌డ్రా చేసుకోవచ్చా?

60 ఏళ్లు నిండిన తర్వాత సాధారణ, చివరి విత్‌డ్రా చేయవచ్చు. మొత్తంగా కార్పస్‌లో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ 40 శాతాన్ని తప్పనిసరిగా యాన్యుటీలుగా మార్చుకోవాలి. కార్పస్ రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే, మొత్తం అందుతుంది. యాన్యుటీ ప్లాన్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన అవసరం NPS అంశంలో ఉన్న ప్రధాన అడ్డంకి. ఈ పెన్షన్ ఆదాయంపై కూడా వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. NPS సబ్‌స్క్రైబర్ మరణించిన సందర్భంలో, నామినీలు మొత్తం కార్పస్‌ను ఉపసంహరించుకోవచ్చు. దానిలో కొంత భాగాన్ని యాన్యుటీలుగా మార్చుకునే అవకాశం ఉంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad