POST OFFICE JOBS: పదవ తరగతి తో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. జీతం మరియు పూర్తి వివరాలు

 Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీలు, విద్యార్హతల వివరాలివే


ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వేర్వేరు సర్కిళ్లల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక పలు పోస్టల్ సర్కిళ్లల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చాయడానికి 2022 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

India Post Office Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఆగస్ట్ 12

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.

వయస్సు- 56 ఏళ్ల లోపు

ఎంపిక విధానం: - రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్-

O/o the Senior Manager (JAG), 

Mail Motor Service, No 37, 

Greams Road, 

Chennai 600 006

CLICK HERE FOR NOTIFICAITON 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad