ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థి దాడి ..పోలీసు స్టేషన్ కి చేరిన పంచాయితీ

ప్రధానోపాధ్యాయుడిపై విద్యార్థి దాడి పోలీసు స్టేషన్ కి  చేరిన పంచాయితీ

ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: గురువుపై దాడి చేసిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదోని మండల పరిధిలోని మండిగిరి పంచా యతీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలలో తోటి విద్యార్థిను లను కామెంట్లు చేయడం, ఉపాధ్యాయుల పట్ల దురు సుగా ప్రవర్తించడంతో పలువురు విద్యార్థులు ఈ నెల 23న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రధానోపాధ్యాయుడు ఆ విద్యార్థిని మంద లించి కొద్ది సేపు క్లాసు బయట నిలబెట్టాడు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడన్నారు. మరుసటి రోజు పాఠ శాలకు మరికొందరితో కలిసి వచ్చి విద్యార్థులను, ఉపాధ్యా యులను బెదరించి వెళ్లిపోయాడు. 

READIIM, అహ్మదాబాద్ శిక్షణకు హాజరు కావడానికి గుర్తించబడిన పాఠశాల  బ్యాచ్ 4 హెడ్ మాస్టర్ ల వివరాలు 

సోమవారం పాఠశా లకు వచ్చిన ఆ విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల నాపైనే ఫిర్యాదు చేస్తారా? అని దురుసుగా ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన ఉపాధ్యాయులను సైతం ఇష్టానుసారంగా బెదరిం పులకు పాల్పడుతుండడంతో ప్రధానోపాధ్యాయుడు పోలీ సులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీ సులు పాఠశాలకు వచ్చి ఆ విద్యార్థిని అదుపులో తీసుకు న్నారు. 'న్యూస్టుడే' ఈ విషయాన్ని రెండో పట్టణ ఎస్సై చంద్ర దృష్టికి తీసుకెళ్లగా.. తమకు లిఖిత పూర్వ కంగా ఫిర్యాదు అందలేదని.. కాగా విద్యార్ధిని, వారి కుటుంబ సభ్యులను స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించామన్నారు. ఎంఈఓ శివరాములుతో ప్రస్తావిం చగా.. తమకు ఎలాంటి సమాచారం రాలేదని, విచారణ చేస్తామని పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad