IMF: ఆర్థిక అంధకారంలో భారత్ వెలుగులు.. IMF సంచలన నివేదిక..

IMF: ఆర్థిక అంధకారంలో భారత్ వెలుగులు.. ఐఎంఎఫ్ సంచలన నివేదిక..

IMF: గ్లోబల్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీనికి కరోనా నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు అనేక కీలక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందన్న అంశంపై IMF చీఫ్ సంచలన ప్రకటన చేశారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని అన్నారు. కొంత కాలం పాటు ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే కొనసాగుతాయని ఆమె అన్నారు. వచ్చే ఐదేళ్లలో వృద్ధి 3% లోపే ఉంటుందని వెల్లడించారు. ఇది 1990 తర్వాత కనిష్ట స్థాయి. తాజా అంచనాలు గత రెండు దశాబ్దాల సగటు 3.8 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

ఈ పరిస్థితిలో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాల వాటా సగం ఉంటుందని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. వృద్ధి మందగమనం తక్కువ ఆదాయ దేశాలకు పెద్ద దెబ్బ అని ఆమె అన్నారు. దీని వల్ల ఆయా దేశాల్లో పేదరికం, ఆకలి బాధలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశాలపై విధాన నిర్ణేతలు చర్చించనున్నారు. భారీ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాలు తమ వృద్ధి రేటులో క్షీణతను ఆశిస్తున్నాయని IMF చీఫ్ పేర్కొన్నారు. ఎగుమతులకు డిమాండ్ తక్కువగా ఉన్నందున చిన్న దేశాలకు రుణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని IMF పేర్కొంది. అయితే, 2008 సంక్షోభం తర్వాత ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో తాజా సంక్షోభం అనేక దేశాలలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad