భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్‌గా పిలవబడుతుందా..?

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రైవేట్ పరం కాబోతోందని దీన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కొనుగోలు చేస్తున్నారంటూ వార్త ప్రచారంలో ఉంది. రైల్వేస్‌ను పూర్తిగా అమ్మకానికి పెడుతున్నట్లుగా మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందుకోసం ఏడు కంపెనీలు ఒక్కటయ్యాయని ఆ పై 3.5 లక్షల రెగ్యులర్ ఉద్యోగస్తులను తొలగించి వారిస్థానంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన కార్మికులను తీసుకుంటారని వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ఇటు రైల్వే ఉద్యోగస్తుల్లో ఆందోళన కంగారుకు గురిచేసింది. 

అయితే స్వల్ప సమయంలో విస్తృతంగా వైరల్ అయిన ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కొన్ని వార్తా వెబ్‌సైట్లు కూడా ఈ వార్తను ప్రచురించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదంటూ కన్నెర్ర చేసింది. ఇక రైల్వేస్ ప్రైవేట్ పరం చేస్తున్నామని, అదాని పేరుతో ఇకపై భారతీయ రైల్వేలు పేరు మార్చుకోబోతున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక అసలు విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 15 ప్రైవేట్ కంపెనీలు కంటెయినర్ ట్రైన్స్‌ను ఆపరేట్ చేసుకునేందుకు లైసెన్స్‌లు కలిగి ఉన్నాయి. ఇందులో అదానీ గ్రూప్ కూడా ఉంది. 2007 జనవరిలో కంటెయినర్ రైళ్లు నడుపుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లకు భారతీయ రైల్వేలు అనుమతి ఇచ్చింది.

2018 వరకు అదానీ గ్రూప్, టాటా స్టీల్ సంస్థలు తమ సొంత వాగన్లను నడుపుకుంటామనే ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచగా అలాంటి ఆరు ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనరల్ పర్పస్ వాగన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద ఈ వాగన్లు నడుపుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఖనిజాలు ,బొగ్గును రవాణా చేసుకునేందుకు ఆయా కంపెనీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. 2018 వరకు ఇవన్నీ రైల్వే అధీనంలోనే నడిచేవి.

Fact Check 

వాదన: ఇకపై భారతీయ రైల్వేలు అదానీ రైల్వేస్‌గా పేరు మార్పు. 

వాస్తవం: భారతీయ రైల్వేస్ పేరు మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad