Google Pay: ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆఫర్‌, స్పందించిన గూగుల్‌ పే

 Google Pay: ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆఫర్‌, స్పందించిన గూగుల్‌ పే


న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌ పే తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఆఫర్‌ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ వార్తలను నేరుగా ప్రస్తావించకుండా... తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్‌లో సర్వీసులు అందిస్తున్నామని స్పష్టం చేసింది.

పలు సందర్భాల్లో కొన్ని ఆఫర్లను తామే స్వయంగా అందిస్తున్నామనే అపోహలు ఉంటున్నాయని, అవి సరికాదని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది.చాలా వ్యాపారాలు.. కొత్త వినియోగదారులకు చేరువయ్యేందుకు తమ ప్లాట్‌ఫాం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోందని గూగుల్‌ తెలిపింది.

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో డిజిటల్‌గా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తెరిచే సౌలభ్యాన్ని గూగుల్‌ పే ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారు ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు.  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad