సొంత ఫోన్లలోనే హాజరు అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సొంత ఫోన్లలో ముఖ హాజరు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు మెత్తబ డ్డాయి. ప్రభుత్వం పరికరాలు ఇస్తేనే యాప్లో హాజరు వేస్తామన్న నేతలు... సొంత ఫోన్లలో హాజరు వేసేందుకు అంగీకరించారు. మంత్రి బొత్స సత్యనారాయణతో గురు వారం జరిగిన సమావేశంలో ఎక్కువ సంఘాలు దీనిపై తమ అంగీకారాన్ని తెలిపాయి. దీంతో యాప్లో ముఖ హాజరు విధానం వెంటనే అమల్లోకి వస్తుందని మంత్రి బొత్స చెప్పారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యాప్లో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించా మన్నారు. ఇంకా ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, టీచర్లను ఇబ్బంది పెట్టేందుకు యాప్లు తీసుకురాలేదన్నారు. సెలవుల విషయంలో పాత నిబంధనలే ఉంటాయని, చిన్నమార్పు కూడా చేయలేదు న్నారు.
యాప్లో హాజరుకు, జీతాలకు సంబంధం లేదని, ఈ విషయంలో పాత నిబంధనలే ఉంటాయని చెప్పారు. ఇప్ప టికే 86శాతం మంది యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నార న్నారు. 8వ తరగతి విద్యార్థులకు వచ్చే నెలలో ట్యాబ్లు ఇస్తామన్నారు. సీపీఎస్ ముట్టడి పేరుతో టీచర్లపై పెట్టిన కేసుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీపీఎ పై ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగులతో మరోసారి చర్చిస్తామ న్నారు. కొత్తగా 38 డిప్యూటీ డీఈవో పోస్టులు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి వివరించారు. ఎంఈవో, డిప్యూటీ డీఈవో పదోన్నతులపైనా సమావేశంలో కీలక చర్చ జరి గింది. ఇటీవల ప్రభుత్వ టీచర్లకు ఎంఈవో ఎఫ్ఏసీ బాధ్య తలు అప్పగించడాన్ని సంఘాలన్నీ వ్యతిరేకించాయి. మండ లానికి రెండు ఎంఈవో పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించిందని, కొత్తగా ఇచ్చే రెండో ఎంఈవో పోస్టులన్నీ జిల్లా పరిషత్ టీచర్లకే ఇస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీల విషయంలోనూ పాత హామీనే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమిదేళ్లు తీసుకోవాలని టీచర్లు. కోరగా, ఐదేళ్లే తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు. డివైజ్లు ఇవ్వాలని కొన్ని సంఘాలు కోరినా అది కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. అయితే సొంత ఫోన్లలోనే హాజరు వేసేం. దుకు కొన్ని సంఘాలు ముందుగానే అంగీకారం తెలిపినట్లు తెలిసింది. పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేసే సంఘాలకు చివర్లో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో దాదాపుగా అందరూ అంగీకరించినట్లయింది.
♦️గ్రేస్ పీరియడ్ పై చెరో మాట
అమరావతి: యాప్లో హాజరు విషయంలో మరో 15రోజుల గ్రేస్ పీరి యడ్ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు చర్చల అనంతరం తెలిపాయి. కానీ అలాంటిదేమీ లేదని మంత్రి బొత్స వెల్లడిం చారు. దీంతో ఈ విషయంపై కొంత అస్పష్టత నెలకొంది. 15 రోజుల తర్వాత మళ్ళీ సమావేశం అవుదామని మంత్రి హామీ ఇచ్చారని సంఘాలు పేర్కొనగా, సమస్యలన్నీ పరిష్క రించామని మంత్రి తెలిపారు. యూటీఫ్ నుంచి ఎన్. వెంకటే శ్వర్లు, ఏపీటీఎఫ్ 257 నుంచి సీహెచ్ మంజుల, ఏపీటీఎఫ్ 1938 నుంచి ఎస్. చిరంజీవి, ఎస్టీయూ నుంచి ఎల్.సాయి శ్రీనివాస్, తిమ్మన్న, ఆప్తా నుంచి ప్రకాశ్ రావు, పీఆర్టీయూ నుంచి కరుణానిధి చర్చల్లో పాల్గొన్నారు.
♦️40 శాతం హాజరు నమోదు
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40శాతం మంది టీచర్లు యాప్ ద్వారా హాజరు నమోదు చేశారు. ఉదయం 10.40 గంటల సమయానికి ఈ మేరకు హాజరు నమోదైంది. 1.85 లక్షల మందికి గాను 64వేల మంది యాప్ ద్వారా హాజరు వేశారు. 1.59 లక్షల మంది వారి ఫోన్లలో యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.